అజార్ మ్యాచ్ ఫిక్సింగ్ పై సీబీఐ తో విచారణ

V6 Velugu Posted on Aug 13, 2021

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులను మళ్లీ తెరవాలన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి. అంతేకాదు..సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. HCAలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు, ఫేస్ బుక్ లో ఆరోపణలు చేసినందుకు తమపై అజార్ రూ. 2 కోట్లకు పరువునష్టం దావా వేశారని చెప్పారు.

ఈ దావా విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు ఇవాళ(శుక్రవారం) గురువారెడ్డి హాజరయ్యారు. అజార్ వేసిన పరువునష్టం దావాపై తాము కౌంటర్ వేశామని..అయితే ఇప్పటి వరకు ఆయన నుంచి సమాధానం రాలేదన్నారు. బీసీసీఐ ఆదేశాలను అజార్ పాటించడం లేదని చెప్పారు. HCAలో ఆయన చేసిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Tagged Azhar match-fixing, probed, CBI, Telangana Cricket Association secretary

Latest Videos

Subscribe Now

More News