దుబాయ్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం టాప్ ర్యాంక్‌లో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. కోహ్లీ 1013 రోజుల పాటు టాప్ ప్లేస్‌లో ఉండగా బాబర్ (1030 రోజులు) దానిని అధిగమించాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో బాబర్.. తన టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోవడంతో ఈ రికార్డు సాధ్యమైంది. ఈ ఏడాది కేవలం రెండు టీ20లు మాత్రమే ఆడిన కోహ్లీ 21వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఇషాన్ ఏడో ర్యాంక్‌లో నిలిచాడు.
