కోహ్లీతో వద్దు పాక్​ లెజెండ్స్​తో పోల్చండి

కోహ్లీతో వద్దు పాక్​ లెజెండ్స్​తో పోల్చండి

కరాచీ: ఏ విషయంలోనైనా తనను పాకిస్థాన్​ లెజెండ్స్​తో పోల్చితే చాలా సంతోషిస్తానని పాక్ లిమిటెడ్​ ఓవర్స్​ కెప్టెన్​ బాబర్​ ఆజమ్​ అన్నాడు. దీనివల్ల తాను సాధించిన ఘనతలకు తగిన గుర్తింపు వస్తుందన్నాడు. కానీ ప్రతిసారి టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీతో పోల్చి తనను తక్కువ చేయొద్దన్నాడు. ‘ఒకవేళ మీరు నన్ను ఎవరితోనైనా పోల్చాలనుకుంటే.. పాక్​ ప్లేయర్లతో కంపేర్​ చెయ్యండి. మియాందాద్​, యూనిస్​ ఖాన్​, ఇంజమామ్​లాంటి లెజెండ్స్​ మాకూ ఉన్నారు. వీళ్లతో నన్ను పోల్చితే.. నేను మరింత గర్వపడతా. నేను సాధించిన ఘనతలు కూడా ప్రపంచానికి తెలుస్తాయి. కానీ పదేపదే విరాట్​తో పోల్చడం వల్ల నేను క్రికెట్​లో వెనుకబడిపోతున్నానని అనిపిస్తుంది’ అని ఆజమ్​ వ్యాఖ్యానించాడు. పాక్​ తరఫున ఇంటర్నేషనల్​ లెవెల్​లో బాబర్​ చాలా నిలకడగా ఆడుతున్నాడు. దీంతో అతన్ని ఎక్కువగా విరాట్​తో పోలుస్తుంటారు. అయితే తాను కూడా విరాట్​లా ఆడాలని, అతనిలా ఎదగాలని గతంలో చాలాసార్లు వెల్లడించిన బాబర్​..ఈసారి మాత్రం మాట మార్చాడు. ప్రస్తుతం టీ20ల్లో బాబర్​ టాప్​ ర్యాంక్​లో ఉండగా, కోహ్లీ వన్డేల్లో నంబర్​ వన్​ ప్లేస్​లో కొనసాగుతున్నాడు. వన్డే, టీ20ల్లో బాబర్​ యావరేజ్​ 50 కాగా, టెస్ట్​ల్లో 45గా ఉంది.

ఆధారాల్లేవ్..ఫిక్సింగ్ కథ ఖతం