Cricket World Cup 2023: హైదరాబాద్‪లో చివరి మ్యాచ్ ఆడుతున్న పాక్.. చిన్న పిల్లలతో బాబర్ ముచ్చట్లు

Cricket World Cup 2023: హైదరాబాద్‪లో చివరి మ్యాచ్ ఆడుతున్న పాక్.. చిన్న పిల్లలతో బాబర్ ముచ్చట్లు

ఏడేళ్ల తర్వాత భారత్ లో పర్యటించిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ లో అడుగుపెట్టింది. దాదాపు రెండు వారాల పాటు హైదరాబాద్ లోనే ఉన్న పాక్ నేడు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ తో హైదరాబాద్ కి ముగింపు పలకనుంది. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ సరదాగా చిన్నపిల్లలతో ముచ్చటించాడు.
 
రాజీవ్ గాంధీ స్టేడియంలో పాక్ వరల్డ్ కప్ లో తమ రెండో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచుకు జాతీయ గీతం పాడడానికి ముందు బాబర్ చిన్నపిల్లతో మాట్లాడుతూ పిల్లాడిలా మారిపోయాడు. వారి చేయి పట్టుకొని వారితో గంతులేస్తూ ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది . ఎంతో ముచ్చట గొలుపుతున్న ఈ వీడియో చూసి బాబర్ అజామ్ ని నెటిజన్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు. హైదరాబాద్ చూపించిన ప్రేమకు బాబర్ ఫిదా అయిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా.. ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఆరంభంలో కుషాల్ పెరీరా డకౌటైనా  కుశాల్ మెండిస్(77 బంతుల్లో 122), సధీర సమర విక్రమ (82 బంతుల్లో 100)  మెరుపు సెంచరీలతో ఒక్కసారిగా స్కోర్ వేగం అమాంతం పెరిగింది. ఓపెనర్ నిస్సంక అర్ధ సెంచరీ చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.