
చిన్న సినిమాగా వచ్చిన బేబీ(Baby) బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన కేవలం 12 రోజుల్లోనే రూ.71 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్ కు గురిచేసింది. ఒక చిన్న సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విడుదలై రెండు వారాలవుతున్నా కలెక్షన్స్ లో జోరు మాత్రం తగ్గడం లేదు.
ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh). బేబీ సినిమా ఇంత విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం ఈ సినిమాలోని పాటలు. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం బేబీ సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి. విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు చాట్ బస్టర్ అయ్యాయి. ప్రేక్షకులను థియేటర్స్ కు వచ్చేలా చేశాయి.
AsloRead:బ్రో మూవీ కలెక్షన్స్ పై వర్షాల ఎఫెక్ట్
అయితే తాజాగా ఈ సినిమాలో మరో పాటను యాడ్ చేయనున్నారట. చందమామ అంటూ సాగే ఈ పాటను సింగర్ దీపు పాడినట్లు సాయి రాజేష్ తెలిపారు. దీనికి సంబందించిన ఫోటోను కూడా షేర్ చేశారు. నిజానికి ఈ సాంగ్ సినిమాలో లేదని చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు. అందుకే ఈ పాటను యాడ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట మేకర్స్. ఈ సాంగ్ కోసం మల్లి సినిమాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఆడియన్స్. అయితే ఈ సాంగ్ ను ఎప్పుడు యాడ్ చేస్తారు అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
#BabyTheMovie
— Sai Rajesh (@sairazesh) July 27, 2023
7th song loading ♥️
Singer Deepu ♥️#Chandamama pic.twitter.com/kuMwDEGbBp