
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్రో మూవీ మానియా నడుస్తుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పవన్ కల్యాణ్ యాక్టింగ్ అద్భుతం అంటున్నారు. బ్రో.. బ్రో అంటూ స్లోగన్స్ తో ధియేటర్లలో హంగామా నడుస్తుంది. ఈ క్రమంలోనే ఎక్స్ తోపాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో కొంత మంది.. సినిమా హాళ్లలో సీట్లకు సంబంధించిన ట్విట్లు చేయటం.. ధియేటర్లు ఖాళీ అంటూ ప్రచారం చేయటంపై చిత్ర యూనిట్ స్పందించింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో వాన బీభత్సం నడుస్తుంది. చాలా గ్రామాలతోపాటు నగరాలు, పట్టణాల్లోని బస్తీలు, లోతట్టు ప్రాంతాలు అన్నీ నీట మునిగాయని.. దీని వల్లే బ్రో ఫస్ట్ డే కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో లేవని అంచనా వేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావించారు హీరో సాయి ధరమ్ తేజ్. “మీరు చాలా ప్రేమతో బ్యానర్స్ అండ్ భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేస్తూ మాపై చూపే అభిమానం మాకర్ధమవుతుంది. కానీ ఈ ప్రేమ చూపించే క్రమంలో కాస్త జాగ్రత్త వహించండి. ఉత్సాహంతో మీరు ప్రమాదానికి గురి అయితే అది మమ్మల్ని చాలా బాధకి గురి చేస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్త ఉండండి. ప్రస్తుతం వాతావరం కూడా సరిగా లేదు. అది మదిలో ఉంచుకొని మెదలండి అంటూ ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు.
AsloRead: బేబీ మూవీ నుండి క్రేజీ అప్డేట్.. ఆ పాటను యాడ్ చేస్తున్నారట
ఇక బ్రో మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఇది పక్కా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మూవీ అని కొందరు అంటుంటే.. ఫీల్ గుడ్ మూవీ అని.. సెంటిమెంట్ తో కన్నీళ్లు తెప్పించారని మరికొందరు తమ టాక్ వినిపిస్తున్నారు. క్లయిమాక్స్ మరో లెవల్లో ఉందని.. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఇలాంటి క్యారెక్టర్లలో చూడలేదని.. అద్భుతంగా నటించాడని చెబుతున్నారు మరికొంత మంది ఫ్యాన్స్.
అన్నింటికీ కాలం చెప్పే సమాధానం ఎలా ఉంటుందనేది అద్భుతంగా తెరకెక్కించారని.. సాయి ధరమ్ తేజ్ -నటన కూడా చాలా బాగుందనే టాక్ నడుస్తుంది. ఎక్కువ అంచనాలతో సినిమాకు వెళ్లొద్దని.. బ్రో మంచి సినిమా అంటోంది చిత్ర యూనిట్. వర్షాలు తగ్గిన తర్వాత.. అన్ని ధియేటర్లలో కలెక్షన్స్ పెరుగుతాయనే అంచనాలో ఉన్నారు నిర్మాతలు. శుక్ర, శని, ఆది వారాలు.. వీకెండ్ లో హైదరాబాద్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని మెట్రో నగరాల్లో కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మీ ప్రేమకి చాలా చాలా థాంక్స్!!!
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 27, 2023
దయచేసి జాగ్రతగా ఉండండి.#BroTheAvatar pic.twitter.com/yVb1x9ujNQ