బేబీ బ్యూటీకి గీతా ఆర్ట్స్ భారీ ఆఫర్.. ఒక్క సినిమాకే ఇంత క్రేజా?

బేబీ బ్యూటీకి గీతా ఆర్ట్స్ భారీ ఆఫర్.. ఒక్క సినిమాకే ఇంత క్రేజా?

టాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజై బ్లాక్ బస్టర్ సాధించిన మూవీ బేబీ(Baby). ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya), విరాజ్ అశ్విన్(Viraj ashwin) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలైన మొదటి షో నుండో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే  రూ.34 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. 

దర్శకుడు సాయి రాజేష్(Sai rajesh) తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇక సినిమాలో నడిచిన నటీనటులు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ లో కనిపించిన వైష్ణవి చైతన్యకు యూత్ లో నెక్స్ట్ లెవల్ క్రేజ్ వస్తోంది. సినిమా ఆమె నటన ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఈ సినిమాలో వైష్ణవి నటనకు ఫిదా అయిపోయిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఆమెకు తన నెక్స్ట్ సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. రీసెంట్ గా జరిగిన బేబీ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ వైష్ణవి కి తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రివీల్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే.. వైష్ణవి రేంజ్ మారిపోవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.