రూ.50 కోట్ల బేబీ.. కంటెంట్ తో వస్తే కలెక్షన్స్ గ్యారంటీ

రూ.50 కోట్ల బేబీ.. కంటెంట్ తో వస్తే కలెక్షన్స్ గ్యారంటీ

చిన్న సినిమా, పెద్దగా స్టార్స్ కూడా లేరు, దర్శకుడు కూడా కొత్తవాడే అయినా కూడా బేబీ(Baby) సినిమా కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. ఆడియన్స్ కు కావాల్సింది స్టార్ క్యాస్ట్ కాదు, హాై బడ్జెట్ కాదు.. కేవలం కంటెంట్ అని మరోసారి నిరూపించింది బేబీ సినిమా. జులై 14న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. విడుదలై వారమవుతున్నా బాక్సాఫీస్ దగ్గర బేబీ సినిమా కలెక్షన్స్ జోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు.

వీకెంపడ్స్ లో కాదు.. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. విడుదలై కేవలం వారం రోజుల్లోనే యాభై కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది బేబీ సినిమా. తాజాగా ఇదే విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ యాభై కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం ఏడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా యాభై కోట్లు కలెక్ట్ చేయడంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ లాభాలు వచ్చాయి. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఈ రేంజ్ లాభాలు వచ్చిన సినిమా బేబీ నే కావడం విశేషం.

ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ(Anand devarakonda) హీరోగా నటించగా, వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya) హీరోయిన్ గా నటించింది. విరాజ్ అశ్విన్(Viraj ashwin) మరో కీ రోల్ లో కనిపించిన ఈ సినిమాను.. దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh) తెరకెక్కించారు.