రెండు రోజుల్లోనే బ్రేకీవెన్ .. బేబీ సినిమాకు భారీ లాభాలు

రెండు రోజుల్లోనే బ్రేకీవెన్ .. బేబీ సినిమాకు భారీ లాభాలు

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya) జంటగా వచ్చిన బేబీ(Baby) మూవీకి యూత్ ఫిదా ఐపోతున్నారు. దర్శకుడు సాయి రాజేష్(Sai rajesh) తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ మోతమోగిస్తోంది. జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించి.. లాభాల బాట పట్టింది. ఈ ఇయర్ లో వచ్చిన క్లీన్ హిట్స్ లిస్టులోకి చేరిపోయింది బేబీ మూవీ.

ఇక తాజాగా బేబీ మూవీ కలెక్షన్స్(Baby movie collections) లిస్టు రివీల్ చేశారు నిర్మాత SKN. తొలిరోజు ఈ సినిమా రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. రెండో రోజు అంతకంటే కలెక్షన్స్ రాబట్టింది. రెండురోజుల్లో మొత్తంగా రూ.14.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బేబీ సినిమా రాబట్టిందని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాత. ఇక ఈ సినిమా మేకింగ్ కు అయినా ఖర్చు రూ.7 కోట్ల వరకు మాత్రమే. కాబట్టి.. విడుదలైన రెండురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల్లోకి కూడా వెళ్లిపోయింది బేబీ మూవీ.

దీంతో బేబీ సినిమాను కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి సినిమా విడుదలై రెండు రోజులే అయింది కాబట్టి ఈ కలెక్షన్స్ మరింత పెరుగనున్నాయి. అంతేకాదు.. కొత్త సినిమాలు కూడా రిలీజ్ కు లేకపోవడం కూడా బేబీ సినిమాకు కలిసొచ్చే అంశమే అవనుంది. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్స్ రాబట్టనుంది అనేది చూడాలి.