పుట్టంగనే రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

పుట్టంగనే రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

ప్రపంచాన్ని లీడ్​ చేస్తున్న ఇండియా, బంగ్లాదేశ్​, నేపాల్​

మూడు రెట్లు పెరిగిన బర్త్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్లు

పదేళ్లలో ఇండియాలో 80 శాతానికి పెరుగుదల

ప్రపంచంలో రిజిస్టర్​ కాని పిల్లలు 16.6 కోట్లు: యునిసెఫ్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌

ఒకప్పుడు పిల్లలు పుట్టగానే బర్త్​ సర్టిఫికెట్​ తీసుకునేటోళ్లు కాదు. కానీ, ఇప్పుడు కాలం మారింది. పుట్టిన 15 రోజుల్లోపే పిల్లల పేరు మీద బర్త్​ సర్టిఫికెట్​ తీసుకుంటున్నారు పిల్లల అమ్మానాన్నలు. ఈ మధ్య కాలంలో ఆ ట్రెండ్​ మరింత పెరిగిపోయింది. ప్రపంచంలో ఇండియా, బంగ్లాదేశ్​, నేపాల్​లే ఆ ట్రెండ్​లో ముందున్నాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ‘బర్త్​ రిజిస్ట్రేషన్​ ఫర్​ ఎవ్రీ చైల్డ్​ బై 2030: ఆర్​ వి ఆన్​ ట్రాక్​?’ పేరిట ఐక్యరాజ్యసమితి చిల్డ్రెన్స్​ ఫండ్​ యునిసెఫ్​ రిపోర్టును విడుదల చేసింది. 174 దేశాలకు సంబంధించిన డేటాను విశ్లేషించి నివేదికను తయారు చేసింది. అందులో పుట్టే నలుగురు పిల్లల్లో ముగ్గురికి బర్త్​ సర్టిఫికెట్​ తీసుకుంటున్నట్టు వెల్లడించింది. పదేళ్లలో బర్త్​ రిజిస్ట్రేషన్లు 20 శాతం పెరిగాయని తెలిపింది.

మన దేశంలో 80 శాతం

ప్రపంచం మొత్తంలో బర్త్​ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ఇండియా, బంగ్లాదేశ్​, నేపాల్​లే ముందున్నాయి. ఇరవై ఏళ్లలో ఈ మూడు దేశాల్లో బర్త్​ రిజిస్ట్రేషన్లు మూడు రెట్లు పెరిగాయి. అప్పట్లో 23 శాతం మాత్రమే ఉన్న పిల్లల నమోదు, ఇప్పుడు 70 శాతానికి పెరిగింది. ఈ మూడు దేశాల్లోనూ ఇండియానే టాప్​లో ఉండడం విశేషం. 2005–06లో కేవలం 41 శాతం మాత్రమే ఉన్న బర్త్​ రిజిస్ట్రేషన్లు, పదేళ్లలో 80 శాతానికి పెరిగాయి. దక్షిణాసియాలో బర్త్​ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నా, అవి పడిపోయే ప్రమాదముందని యునిసెఫ్​ రిపోర్ట్​ పేర్కొంది. కారణం, పాకిస్థాన్​, ఆఫ్గనిస్థాన్​లలో బర్త్​ రిజిస్ట్రేషన్లు పడిపోవడమేనని వెల్లడించింది. ఇక, సబ్​సహారన్​ ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా, జాంబియా, చాడ్​ అట్టడుగున నిలిచాయి.

అక్కడ పెద్దోళ్ల ఇండ్లలోనే పెరిగాయి

బర్త్​ రిజిస్ట్రేషన్​ చేయించుకోవడం వల్ల పేదలకు చాలా మంచి జరుగుతోందని యునిసెఫ్​ రిపోర్టు పేర్కొంది. అయితే, సబ్​సహారన్​ ఆఫ్రికా దేశాల్లో మాత్రం డబ్బున్నోళ్లే పిల్లల పుట్టుక వివరాలను రిజిస్టర్​ చేయిస్తున్నారని, పేదోళ్లు చేయించట్లేదని రిపోర్టు పేర్కొంది. ఇటు మన పొరుగు దేశం పాకిస్థాన్​లో 2006–07 నుంచి బర్త్​ రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయని, అక్కడా పెద్దోళ్లే తమ పిల్లల పుట్టుకను రిజిస్టర్​ చేయిస్తున్నారని వెల్లడించింది. బర్త్​ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నా, దశాబ్ద కాలంలో పావు వంతు మంది పిల్లలు మాత్రం అందుకు నోచుకోవట్లేదని రిపోర్టు పేర్కొంది. దాని వల్ల వాళ్లకు ఎలాంటి బెనిఫిట్లు అందట్లేదని, ప్రభుత్వ ఫలాలు అందట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బర్త్​ రిజిస్ట్రేషన్​ చేయని పిల్లలు 16.6 కోట్ల మంది దాకా ఉన్నారని చెప్పింది.

చదువు, ఆరోగ్యం అందట్లె

బర్త్​ రిజిస్ట్రేషన్​ జరగకపోవడం వల్ల చాలా మంది పిల్లలు ప్రభుత్వ లెక్కల్లో ఉండట్లేదని యునిసెఫ్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ హెన్రిటా ఫోర్​ చెప్పారు. వాళ్లకు ప్రభుత్వం అందించే కనీస అవసరాలైన చదువు, ఆరోగ్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఐడెంటిటీ లేకపోవడంతో వాళ్లకు అందాల్సిన ఫలాలు అందట్లేదన్నారు. కాబట్టి అన్ని దేశాల ప్రభుత్వాలు అందుకు తగినట్టు సస్టెయినబుల్​ డెవలప్​మెంట్​ గోల్స్​ (ఎస్​డీజీ) పెట్టుకోవాలని సూచించారు. 2030 నాటికి పిల్లలందరికీ బర్త్​ రిజిస్ట్రేషన్​ సహా సరైన ఐడెంటిటీ కల్పించాలన్నారు. ప్రతి మూడు దేశాల్లో ఒక దేశం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నారు.