కొత్త ఏడాదిలో భూ స్కామ్ లు జరుగుతయ్

కొత్త ఏడాదిలో భూ స్కామ్ లు జరుగుతయ్

హైదరాబాద్, వెలుగు: కొత్త ఏడాదిలో రాష్ట్రంలో భూస్కామ్ లు జరుగుతాయని పంచాంగ నిపుణుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ అబిడ్స్ లోని దేవాదాయ శాఖ కమిషనరేట్ లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన కొత్త పంచాంగాన్ని చదివి వినిపించారు.

కొత్త పాస్ బుక్ లో ఉండి.. ధరణి లో కనిపించకుండా పోయినా సర్వే నంబర్స్ రావడం లేదు. దీంతో ఈ నంబర్లను తమ పేరిట నమోదు చేయాలని భూమి యజమాని అప్లై చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ధరణిలో సర్వే నంబర్ లేకుంటే సవరించే అధికారం తహసీల్దార్లకు లేదు. దీంతో రైతులు నేరుగా కలెక్టర్​కు దరఖాస్తు చేసుకొని.. కలెక్టరేట్​ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. సర్కార్​కు భూములిచ్చి అవస్థలు భూదానోద్యమం, సీలింగ్ యాక్ట్ లో భాగంగా సర్కార్ కు అప్పగించగా పోనూ మిగిలిన భూములు యజమానుల దగ్గరే ఉన్నాయి. అయితే వారిచ్చిన భూములు ప్రభుత్వ పరం కావడంతో సదరు సర్వే నంబర్లలో ఉన్న మొత్తం ల్యాండ్​ను ధరణి పోర్టల్​లో ‘ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ’ లిస్టులో చేర్చారు. దీంతో సర్కారుకు ఇచ్చింది పోగా యజమానులకు మిగిలిన సొంత భూములు కూడా నిషేధిత జాబితాలో చేరాయి. ‘‘నాకో వంద ఎకరాలు ఉన్నాయి. 25 ఎకరాలను సీలింగ్ కింద ప్రభుత్వానికి అప్పగించాను. ఇప్పుడు మొత్తం వంద ఎకరాలు ప్రొహిబిటెడ్ జాబితాలో పడ్డాయి’’ అని స్వయంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు. ఇరిగేషన్, ఇతర ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వాళ్ల పరిస్థితి ఇలాగే మారింది. రికార్డులు మార్చి ఆగం చేసిన్రు ధరణి పోర్టల్ కు ముందు భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్​మెంట్ సిస్టం (ఐఎల్ఆర్ఎంఎస్) పోర్టల్ నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి ఏపీలో 2011లో ‘మా భూమి’ పేరిట పోర్టల్, వెబ్​ల్యాండ్, 2016లో మా భూమి పోర్టల్, టీల్యాండ్ పేరుతో ఆన్​లైన్ భూరికార్డులు నిర్వహించారు. ఈ పోర్టల్స్​లో భూమి సర్వే నంబర్, పహాణీ, టిప్పన్, ఆర్వోఆర్1బీ, గ్రామ పటం చూసుకునే వీలుండేది. ఈ క్రమంలోనే భూ రికార్డుల ప్రక్షాళన పేరిట పాత పాస్ బుక్స్​ను రద్దు చేసి కొత్త పాస్​బుక్స్​ను ఇచ్చిన ప్రభుత్వం.. ఈ డేటాను ఐఎల్ఆర్ఎంఎస్ పోర్టల్ లో పొందుపరిచింది. ఇందులో ఆర్వోఆర్, వన్ బీ, గ్రామనక్షలు, అమెండ్​మెంట్ రిజిస్టర్, పహాణీ, పార్ట్​ బీలో చేర్చి పాస్​బుక్స్ జారీ చేయని పెండింగ్ సర్వే నంబర్లు, తదితర సమగ్ర భూరికార్డులు ప్రజలకు కనిపించేవి. అయితే ధరణి పోర్టల్ రాగానే సీసీఎల్ఏ వెబ్ సైట్ లోని భూరికార్డుల సమాచారాన్ని తొలగించారు. పక్కా హక్కుల రికార్డుగా తీసుకొచ్చిన ధరణిలో లక్షలాది సర్వే నంబర్లు ఎగిరిపోవడంతో సమస్య భూరికార్డుల సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లయింది.

ఆఫీసు చుట్టూ తిరుగుతున్నం
ఆదిలాబాద్ జిల్లాలోని మాదాపూర్‌‌లో సర్వే నంబర్ 24/35 యజమాని కాటిపెల్లి సాంబయ్య మృతి చెందారు. ఆయన కొడుకు జగదీశ్వర్ రెడ్డికి విరాసత్ చేయించుకోడానికి వెళ్తే భూమి చూపించట్లే దు. స్లాట్ బుక్ కావట్లేదు. ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దాబా గ్రామంలో జాదవ్ శివలాల్ అనే రైతు మృతిచెందాడు. ఆయనకు 1/23 సర్వే నంబర్​లో భూమి ఉండేది. ఆయన ఇద్దరు కుమారులు తమ పేరిట పట్టా చేయించుకోవాలని వెళ్తే సర్వే నంబర్ కనిపించడం లేదు.

2.16 ఎకరాలు మాయం
సూర్యాపేట జిల్లా రావిపహాడ్​కు చెందిన నర్సిరెడ్డికి 69/2/2 సర్వే నంబర్​లో 3.29 ఎకరాలకు కొత్త పాస్​బుక్ వచ్చింది. ఈ భూమిపై 4 సార్లు రైతు బంధు అందింది. ఈ మధ్య రైతుబంధు సాయం తక్కువగా రావడంతో నర్సిరెడ్డి.. మీ సేవకు వెళ్లి చెక్ చేయిం చారు. 1.33 ఎకరాలే చూపిస్తోంది. పైగా 69/2/2 అనే సర్వే నంబర్ మాయమై 69/2/2/2 అనే కొత్త నంబర్ వచ్చింది. రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పారు.

నంబర్ ఎగిరిపోయింది
మహబూబ్​నగర్ జిల్లా నవాబ్​పేట మండలం తీగల్​పల్లికి చెందిన  జి.ప్రవీణ్ కుమార్​కు సర్వే నంబర్ 165లో 27 గుంటలు, 165/1లో 33 గుంటలు, 165/2/బీలో 6 గుంటలు, 165/ఈలో 16 గుంటలు, 165/ఎఫ్​లో 16 గుంటల భూమి ఉంది. మొత్తం 2.18 ఎకరాలకు ఆయనకు కొత్త పట్టాదారు పాస్ బుక్ కూడా జారీ అయ్యింది. ధరణి పోర్టల్ వచ్చాక ఓపెన్ చేసి చెక్ చేయగా.. చివరగా ఉన్న 165/ఎఫ్ సర్వే నంబర్ కనిపించడం లేదు.

ఎకరం వివరాల్లేవ్
నాకు వారసత్వంగా వచ్చిన రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని మా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నం. కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత ఎకరం మాయమైంది. నాలుగు నెలలుగా ఎమ్మార్వో ఆఫీసు చుట్టు తిరిగినా దాటవేస్తున్నరు. భూమి పట్టా ఎక్కించడం లేదు. ఈ రందితోనే నా భార్య చనిపోయింది. సమస్య పరిష్కరించాలి.
- సాయిలు, బొనకొల్లూరు, బచ్చన్న పేట మండలం, జనగామ జిల్లా

14 గుంటలు కనిపిస్త లేదు
గన్నేరువరం శివారులో నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్ 28 లో నాకున్న 14 గుంటల భూమి ధరణి లో రావడం లేదు. ఇప్పటికి నేనే కాస్తులో ఉన్నా. మ్యాన్యువల్ పహాణీలో ఉన్నప్పటికీ కొత్త పాస్ పుస్తకంలో  రాకపోవడంతో రైతుబంధు రావడం లేదు. పంట పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నాం. ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నా పని కావడం లేదు.
- జాలి వీరయ్య, గన్నేరువరం, కరీంనగర్ జిల్లా