అంగన్ వాడీలో తలదాచుకోలేం.. బాచుపల్లి ఇంద్రానగర్ గుడిసెవాసుల ఆందోళన

అంగన్ వాడీలో తలదాచుకోలేం.. బాచుపల్లి ఇంద్రానగర్ గుడిసెవాసుల ఆందోళన
  • 150 కుటుంబాలు ఎలా ఉండగలం    

జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లి ఇంద్రానగర్​ గుడిసెవాసులు అధికారుల తీరుపై మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షానికి బాచుపల్లిలోని బైరన్​ చెరువు నిండి బ్యాక్​ వాటర్​ ఇంద్రానగర్​లోని ఇండ్లలోకి వచ్చి చేరింది. ఇక్కడ 40 ఏళ్లుగా మహబూబ్​నగర్​ జిల్లా కొల్లాపూర్​కు చెందిన 150 గిరిజన వలస కూలీలు గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. 

ఇండ్లలోకి నీరు రావడంతో వీరిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. తలదాచుకోవడానికి అంగన్​వాడీ కేంద్రాన్ని సూచించారు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు.  150 కుటుంబాలు  చిన్న అంగన్​వాడీ కేంద్రంలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ప్రతీసారి ఇదే సమస్య ఎదురవుతుందని, ప్రత్యామ్నాయంగా తమకు డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టివ్వాలని, లేదంటే వేరే చోట 60 గజాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్​ చేశారు.