
జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లిలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. జహీరాబాద్‌కు చెందిన సిరిపురం లక్ష్మయ్య కూతురు అనూష బాచుపల్లిలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతుంది. ఆదివారం రాత్రి కాలేజీ క్యాంపస్ లోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువులో ఒత్తిడికి లోనవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.