మెడ‌‌, వెన్ను, న‌‌డుం నొప్పుల‌కు ఆధునిక చికిత్స..!

మెడ‌‌, వెన్ను, న‌‌డుం నొప్పుల‌కు ఆధునిక చికిత్స..!

హైద‌‌రాబాద్ :-  న‌‌గ‌‌రంలోని జూబ్లీ హిల్స్ రోడ్ నెం.1లోగ‌‌ల ఎవిస్ హాస్పిట‌‌ల్స్‌‌లో అంత‌‌ర్భాగ‌‌మైన ఎవిస్ స్పైన్ సెంట‌‌ర్ ఇప్పుడు  అత్యాధునిక చికిత్సల‌‌తో రోగుల‌‌కు సేవ‌‌ల‌‌ను అందిస్తోంది. మెడ‌‌, వెన్ను, న‌‌డుంనొప్పుల‌‌తో  దీర్ఘ కాలంగా బాధ‌‌ప‌‌డేవారికి ప్రముఖ  స్పైన్ స‌‌ర్జన్ డాక్టర్‌‌ కె. రాఘ‌‌వ సునీల్ స్వ‌‌యంగా ప‌‌రీక్ష‌‌లు చేసి త‌‌మ వైద్యంతో వారిని సంపూర్ణ ఆరోగ్య‌‌వంతులుగా తీర్చిదిద్దుతున్నారు. కాలానుగుణంగా అందుబాటులోకి వ‌‌స్తున్న అత్యాధునిక చికిత్సల‌‌పై ఎప్పటిక‌‌ప్పుడు ప‌‌రిజ్ఞానాన్ని పెంచుకుంటున్న డాక్టర్ రాఘ‌‌వ సునీల్‌‌తో ముఖాముఖి.

మెడ‌‌, వెన్ను, న‌‌డుం నొప్పి స‌‌మ‌‌స్యల‌‌తో క‌‌లిగే బాధలు ఏమిటి?

మాన‌‌వ జీవ‌‌నంలో ఇటీవ‌‌ల ప్రధానంగా మెడ‌‌, వెన్ను, న‌‌డుంనొప్పులు పెరుగుతున్నాయి.  నడుంనొప్పి వ‌‌ల్ల కూర్చోలేని ప‌‌రిస్థితి. ప‌‌ని చేసుకోలేని విధంగా  బాధ క‌‌లుగుతుంది. మ‌‌డ‌‌మ‌‌ నొప్పి వ‌‌ల్ల పొద్దున లేచిన‌‌ప్పుడు కాళ్లు కింద‌‌పెట్టలేని బాధ‌‌,  మోకాళ్ల కింద పిక్కలు, తొడ‌‌లు నొప్పి, మోకాళ్ల పైభాగంలోనూ, బ‌‌య‌‌ట భాగంలో నొప్పులు బాధ‌‌పెడ‌‌తాయి. మెడ‌‌నొప్పికి సంబంధించి మెడ‌‌, భుజం నొప్పి, రెండు భుజాల మ‌‌ధ్య నొప్పి, చేతుల నొప్పి ఇబ్బంది పెడ‌‌తాయి. వెన్నెముక‌‌లో ఉన్న న‌‌రాల‌‌పై ఒత్తిడి పెరిగి తిమ్మిర్లు వ‌‌స్తాయి. ముఖ్యంగా  న‌‌డుం నుంచి కాళ్లలోకి , మెడ నుంచి చేతుల్లోకి నొప్పి రావడం, చివ‌‌రిగా కాళ్లు, చేతుల‌‌లో శ‌‌క్తి త‌‌గ్గడం జ‌‌రగ‌‌వ‌‌చ్చు.

ఈ ప‌‌రిస్థితుల‌‌లో ఏంచేయాలి?

దీనిపై స‌‌మ‌‌గ్ర ప‌‌రీక్ష అవ‌‌స‌‌రం. ముఖ్యంగా చేతుల‌‌తో త‌‌డిమి ప‌‌రీక్షించి, త‌‌ర్వాత స‌‌మ‌‌స్య మూలాల్లోకి వెళ్లి స‌‌రైన రీతిలో చికిత్స చేస్తే ఆరోగ్య స‌‌మ‌‌స్య పరిష్కార‌‌మ‌‌వుతుంది.

దీనిలో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు ఏమిటి?

మందులు, విశ్రాంతి వ‌‌ల్ల త‌‌గ్గకుండా వారాలు, నెల‌‌ల త‌‌ర‌‌బ‌‌డి బాధ‌‌ప‌‌డేవారి కోసం స్పైన్ ఇంజ‌‌క్షన్‌‌ లేదా కీహోల‌‌క్ష స్పైన్ స‌‌ర్జరీ మంచి చికిత్స. దీర్ఘకాలంగా న‌‌డుంనొప్పితో బాధ‌‌ప‌‌డేవారికి ఎంఆర్ఐలో  కూడా కార‌‌ణం తెలియ‌‌క‌‌పోయినా..‘ డిస్కోగ్రామ్‌‌’ ప‌‌రీక్ష చేసి మందు ఇవ్వవ‌‌చ్చు. సయాటికా బాధితుల‌‌కు రూట్‌‌బ్లాక్ ఇంజ‌‌క్షన్‌‌, న‌‌డుంలో  జాయింట్ అరిగిన వారికి లేజ‌‌ర్ లాంటి ప‌‌రిక‌‌రంతో నొప్పిని త‌‌గ్గించ‌‌వ‌‌చ్చు. ఇలాంటి ఇంజ‌‌క్షన్‌‌లతో స‌‌ర్జరీ లేకుండానే రోగాల‌‌ను న‌‌యం చేయ‌‌వ‌‌చ్చు.  అంతేగాక న‌‌డుంలో న‌‌రం తీవ్రంగా నలుగుతుంటే ఎండోస్కోపిక్ స్పైన్ స‌‌ర్జరీ ద్వారా ఎటువంటి ర‌‌క్తస్రావం లేకుండా, న‌‌రాల‌‌కు త‌‌క్కువ రిస్క్‌‌తో ఏవ‌‌య‌‌స్సువారికైనా సుర‌‌క్షిత‌‌మైన స‌‌ర్జరీ చేయ‌‌డం ఆధునిక చికిత్సలో భాగం. అంతేగాక దీనివ‌‌ల్ల త్వరితగ‌‌తిన కోలుకోవ‌‌చ్చు.

కాళ్లమంట‌‌లు, ర‌‌క్త ప్రసర‌‌ణ త‌‌గ్గి ఏర్పడే స‌‌మ‌‌స్యల‌‌కు మీ వ‌‌ద్ద చికిత్స ఉందా?

ఖ‌‌చ్చితంగా ! ఈ స‌‌మ‌‌స్యల‌‌కు పరిష్కారం ఉంది. లంబార్ సింప‌‌థెక్టమీ అనే విధానంలో సూది ద్వారా చికిత్స చేసి కాళ్లలో మంట‌‌లు త‌‌గ్గించ‌‌వ‌‌చ్చు.  డాక్టర్ రాఘ‌‌వ సునీల్ ,

ఆర్ధో,  స్పైన్ స‌‌ర్జన్

ఎవిస్ స్పైన్ సెంట‌‌ర్‌‌, జూబ్లీహిల్స్ రోడ్ నెం.1 హైద‌‌రాబాద్‌‌.

సెల్‌‌.. 90000 60639