V6 News

బ్యాడ్‌ బాయ్ కార్తీక్‌ యాక్షన్‌తో సర్‌‌ప్రైజ్ చేస్తాడు

బ్యాడ్‌ బాయ్ కార్తీక్‌ యాక్షన్‌తో సర్‌‌ప్రైజ్ చేస్తాడు

నాగ శౌర్య హీరోగా రామ్ దేశినా దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన  చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఏప్రిల్ 17న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి మాట్లాడుతూ ‘నిర్మాతగా నాకిది తొలి చిత్రం. కదిరి నరసింహస్వామి బ్యాక్‌‌డ్రాప్‌‌లో సాగే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌‌టైనర్ ఇది.  శౌర్యను పూర్తిగా యాక్షన్ టోన్‌‌తో చూస్తారు. ఆయన అందరినీ సర్‌‌ప్రైజ్ చేస్తారు. 

దేవి విజయ్ కుమార్ గారి పాత్ర హైలెట్‌‌గా ఉండబోతుంది. కిషోర్ గారి కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా వున్నాయి.  ఐదు యాక్షన్ సీక్వెన్స్‌‌లు అద్భుతంగా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మరో స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా విషయంలో కొన్ని మార్పులు జరిగాయి. డైరెక్టర్ మారారు. మొదట చేసిన దాంట్లో మూల కథను మాత్రమే తీసుకున్నాం. తర్వాత లక్ష్మీ భూపాల గారు కొంత వర్క్ చేశారు. కథ అదే అయినా ట్రీట్‌‌మెంట్ మారింది. 

రసూల్ ఎల్లోరా గారి విజువలైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. యానిమల్ సినిమాకు పనిచేసిన సుప్రీం సుందర్ గారు, అలాగే పృథ్వి గారు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌‌గా పనిచేశారు. హరీష్ జయరాజ్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాం. ఇక జూన్‌‌లో మా మరో సినిమా మొదలవబోతోంది. అలాగే చిన్న, మీడియం సినిమాలు చర్చల్లో ఉన్నాయి. త్వరలో వెల్లడిస్తాం’ అని చెప్పారు.