
నాగ శౌర్య హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా సోమవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాగ శౌర్య రగ్గడ్ , ఇంటెన్స్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. యాక్షన్ సీన్స్‌తో తనలోని మాస్ క్యారెక్టర్‌ను ‘ద సైలెన్స్ బ్రేక్స్’ అంటూ టీజర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ‘నువ్వు బ్యాడ్ బాయ్ అని చెప్పారు. కానీ స్మార్ట్ బాయ్‌లా ఉన్నావు’ అని శౌర్యను ఉద్దేశించి విలన్ చెప్పడం ఆసక్తికరంగా ఉంది.
పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన సాయి కుమార్ ‘గురి తప్పలా.. తప్పించా’ అని గన్ చూపిస్తూ డైలాగ్ చెప్పడం ఆకట్టుకుంది. విధి యాదవ్ హీరోయిన్‌గా కనిపించగా, సముద్రఖని, నరేష్ వికె, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించారు. ఇంటెన్స్ డ్రామాతోపాటు హ్యూమరస్ కామెడీతో కట్ చేసిన టీజర్ క్యూరియాసిటీని పెంచింది. హరీస్ జైరాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.