పటాన్​ చెరువులో విషాదం: బస్సు ఎక్కుతూ జారిపడిన ప్రయాణికుడు.. చికిత్సపొందుతూ మృతి..

పటాన్​ చెరువులో విషాదం: బస్సు ఎక్కుతూ జారిపడిన ప్రయాణికుడు.. చికిత్సపొందుతూ మృతి..

హైదరాబాద్​ పటాన్​ చెరువు బస్టాండ్​లో విషాద ఘటన జరిగింది.  బస్సు ఎక్కుతూ జారిపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పటాన్​ చెరువు బస్టాండ్​లో జాన్​ మహమ్మద్​ అనే వ్యక్తి బస్సు ఎక్కుతూ కాలు జారి బస్సు వెనుక చక్రం కిందపడ్డాడు. మెదక్​ డిపోకు చెందిన బస్సు కిందపడ్డాడు.తీవ్రగాయాలుకావడంతో.. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రయాణికుడు జాన్​ మహమ్మద్​ మృతి చెందాడు.  కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పటాన్​ చెరువు  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  మృతుడు పటాన్​ చెరువులో డ్రైవర్​ గా పనిచేస్తున్నాడు.