పంజాగుట్ట, వెలుగు: గోషామహల్‌కు చెందిన సీహెచ్ దర్ఫన్ తన భార్య ఉమతో కలిసి గురువారం ఎర్రమంజిల్‌లోని ఓ షాపింగ్ మాల్‌కు బయలుదేరాడు. సోమాజీగూడ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఉమ బ్యాగ్‌ను బైకర్ లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందడంతో పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణతో కలిసి డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడికక్కడే విచారణ జరిపి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధితులకు కాపీ అందజేశారు.
