ప్రజల్లో చైతన్యమే లక్ష్యంగా బహుజన బతుకమ్మ: గాయని విమలక్క

ప్రజల్లో చైతన్యమే లక్ష్యంగా బహుజన బతుకమ్మ: గాయని విమలక్క

సైఫాబాద్, వెలుగు: గ్రామీణ సమస్యలు, జీవ వైవిధ్యం, వలసలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా బహుజన బతుకమ్మ ముందుకు సాగుతుందని అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క అన్నారు. 16వ సారి బహుజన బతుకమ్మను హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ బతుకమ్మ ఆడారు.

ఆమె మాట్లాడుతూ బహుజన బతుకమ్మను కేవలం పండుగగా కాకుండా ప్రజా సమస్యలను చర్చించే వేదికగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. 10వ తేదీ నుంచి బహుజన బతుకమ్మతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను లేవనెత్తుతామన్నారు.