బిర్సా ముండా స్ఫూర్తితో బహుజన రాజ్యం

బిర్సా ముండా స్ఫూర్తితో బహుజన రాజ్యం

ఆదివాసీ, గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యం సాధిస్తామని బీఎస్పీ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. నేటికీ తెలంగాణలో ఆదివాసీలకు కనీస మానవ హక్కులు కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆదివాసీలు వారి పురిటిగడ్డపైనా శరణార్ధుల్లా బతకాల్సిన దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మన దేశానికి ఉన్నప్పటికీ.. పాలకుల నిరంకుశ వైఖరి కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. పాలనలో భాగస్తులను చేయడం ద్వారానే.. ఆదివాసీల జీవితాల్లో మార్పును సాధించగలమని చెప్పారు. బిర్సా ముండా వర్ధంతి  సందర్భంగా గురువారం  ఉదయం  ఆయన  ఈమేరకు  ట్వీట్ చేశారు.