
చెక్ బౌన్స్ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఊరట లభించింది. కడప మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు గణేశ్ కు బెయిల్ మంజూరు చేసింది. బాధితులతో బండ్ల గణేశ్ తరపు న్యాయవాది రాజీ కుదిర్చారు. తీసుకున్న అప్పులో రూ.4లక్షలు చెల్లించారు బండ్ల గణేశ్. మిగతా అప్పు మొత్తం వచ్చె నెల 14న చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు .దీంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు బండ్ల గణేశ్ న్యాయవాది. బెయిల్ పిటిషన్ ను పరిశీలించిన మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.