
కుషాయిగూడ, వెలుగు: ఇంట్లో వాళ్లు బెయిల్ ఇప్పించడం లేదని చర్లపల్లి సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీ శనివారం సూసైడ్ చేసుకున్నాడు. చర్లపల్లి పరిధి బీఎన్ రెడ్డి నగర్‌లో షేక్ ఖాజా మియా అలియాస్ ఎండీ ఖాజా బాబా (35) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో ఖాజాకు ఈ నెల 7న మల్కాజిగిరి కోర్టురిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఇంట్లో వాళ్లు తనకు బెయిల్ ఇప్పించడం లేదని మనస్తాపం చెందిన ఖాజా.. శనివారం ఉదయం సంజీవిని బ్యారెక్‌లోని కిటికీకి టవల్తోఉరి వేసుకున్నాడు. గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించగా, అప్పటికే ఖాజా చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు.