ఉత్తమ చిత్రంగా బలగం.. ఫిల్మ్​ఫేర్​ అవార్డ్స్​లో బెస్ట్​ మూవీ

ఉత్తమ చిత్రంగా బలగం.. ఫిల్మ్​ఫేర్​ అవార్డ్స్​లో బెస్ట్​ మూవీ

దరాబాద్, వెలుగు : లాస్ట్ ఇయర్ చిన్న చిత్రంగా విడుదలైన ‘బలగం’  బెస్ట్ మూవీగా నిలిచింది.  బంధుత్వాలు, విలువలు, మట్టివాసనను చాటిచెప్పిన ‘బలగం’ చిత్రం ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్‌‌‌‌ లో సత్తా చాటింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి అవార్డును అందుకున్నారు. అలాగే, బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఫిమేల్ కేటగిరీలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రూప లక్ష్మి అవార్డు దక్కించుకున్నారు.

69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ –2024 వేడుక శనివారం హైదరాబాద్‌‌లో గ్రాండ్‌‌గా జరిగింది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు సంబంధించి  గత ఏడాది ప్రజాదరణ పొందిన సినిమాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ  కార్యక్రమంలో సౌత్ సినీ ఇండస్ట్రీస్ నుంచి పలువురు సెలబ్రిటీస్ హాజరై సందడి చేశారు.  తెలుగు కేటగిరీలో  4 సినిమాలకు అత్యధికంగా  అవార్డులు వరించాయి.

ఇందులో బలగం ఉత్తమ చిత్రంగా నిలిచింది. నాని మాస్ గెటప్‌‌లో మెప్పించిన ‘దసరా’ చిత్రం  ఏకంగా ఆరు అవార్డులను అందుకున్నది. ‘దసరా’లో నటనకు గానూ బెస్ట్ యాక్టర్‌‌‌‌గా నాని, బెస్ట్ హీరోయిన్‌‌గా కీర్తి సురేశ్​​, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌‌‌‌గా శ్రీకాంత్ ఓదెల, బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా సత్యన్ సూర్యన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌గా అవినాశ్​, బెస్ట్ కొరియోగ్రాఫర్‌‌‌‌గా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అవార్డులు అందుకున్నారు. ఫీల్ గుడ్‌‌ లవ్‌‌స్టోరీగా  విజయం అందుకున్న ‘బేబీ’ చిత్రం 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌‌తో సత్తా చాటింది.

ఉత్తమ చిత్ర క్రిటిక్స్ కేటగిరీలో దర్శకుడు సాయి రాజేశ్​ అవార్డు అందుకోగా, ఉత్తమ నటి క్రిటిక్స్‌‌ కేటగిరీలో వైష్ణవి చైతన్య, బెస్ట్ సింగర్‌‌‌‌గా (ఓ రెండు ప్రేమ మేఘాలిలా) పాటకు గాను  శ్రీరామ చంద్ర, బెస్ట్ లిరిసిస్ట్‌‌గా అనంత్ శ్రీరామ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా విజయ్ బుల్గానిన్ అవార్డులు పొందారు. బెస్ట్ డెబ్యూడెంట్ డైరెక్టర్‌‌‌‌గా ‘హాయ్ నాన్న’ దర్శకుడు  శౌర్యువ్ అవార్డు తీసుకున్నారు. మరోవైపు ఉత్తమ సహాయ నటుడిగా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం నుంచి రవితేజకు ‘రంగమార్తాండ’ చిత్రం నుంచి బ్రహ్మానందానికి అవార్డులు దక్కాయి. 

సీఎం అభినందనలు

తెలంగాణ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందిన ‘బలగం’, ‘దసరా’ చిత్రాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ అనుబంధాలను చాటుతూ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్ర బృందాలను సీఎం ఈ సందర్భంగా అభినందించారు.

69వ ఫిల్మ్‌‌ఫేర్ అవార్డ్స్ సౌత్– 2024  విన్నర్స్ లిస్ట్

  • ఉత్తమ చిత్రం : బలగం
     
  • ఉత్తమ దర్శకుడు : వేణు యెల్దండి (బలగం)
  • ఉత్తమ నటుడు : నాని (దసరా)
  • ఉత్తమ నటి : కీర్తి సురేశ్​ (దసరా)
  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : శ్రీకాంత్ ఓదెల
  • (దసరా), శౌర్యూవ్ (హాయ్ నాన్న) 
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బేబీ
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ప్రకాశ్ రాజ్ 
  • రంగమార్తాండ), నవీన్ పొలిశెట్టి 
  • (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి)
  • బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: బ్రహ్మానందం 
  • (రంగమార్తాండ), రవితేజ (వాల్తేరు వీరయ్య)