
‘అఖండ’ ఇచ్చిన సక్సెస్‌తో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్నారు బాలకృష్ణ. ఇప్పటికే నలుగురు దర్శకులను లైన్‌లో పెట్టిన ఆయన.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో పవర్‌ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆల్రెడీ సిరిసిల్లలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ పూర్తయింది. నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ లాంగ్ షెడ్యూల్‌తో షూటింగ్ చాలావరకు కంప్లీట్ అయినట్టేనట. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్‌కుమార్, ‘దునియా’ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు బాలకృష్ణ. ఈ సినిమా కూడా ఈ యేడాదే సెట్స్‌కి వెళ్లనుంది. అయితే ఇందులో బాలయ్యతో పాటు రవితేజ కూడా నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై టీమ్ ఇటీవల రియాక్టయ్యింది. ఇది మల్టీస్టారర్ కాదని, బాలకృష్ణ సోలో పెర్ఫార్మెన్సే ఉంటుందని కన్‌ఫర్మ్ చేశారు. బాలయ్యను దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం మాత్రమే కథ రాశానని చెబుతున్నాడు అనిల్. ఇక బాలయ్యకి బోయపాటి, పూరి జగన్నాథ్‌లతోనూ కమిట్‌మెంట్స్ ఉన్నాయి. మరోవైపు తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కూడా బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. ‘ఆదిత్య 369’ సీక్వెల్‌తో తనని పరిచయం చేస్తున్నారు. బాలయ్యే డైరెక్ట్ చేయనున్నారు.