
నటసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). కాజల్ అగర్వాల్(Kajal agarwal), శ్రీలీల(Sreeleela) కీ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమా.. కోసం బాలయ్య అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి నందమూరి అభిమానులను కలవరపెడుతోంది. అదేంటంటే.. బాలకృష్ణ హీరోగా చేస్తున్న భగవంత్ కేసరి మూవీ.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఖుదా గవా(Khuda gava) కథతో రానుందట.ఈ సినిమాలో హీరో తన ప్రేయసి, స్నేహితుడి కోసం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో అతనికి ఒక కూతురు ఉంటుంది. దీంతో నాన్న ఎవరో తెలియకుండానే ఆమె పెరిగి పెద్దవుతుంది. కొంతకాలానికి బయటకు వచ్చిన.. హీరో తన కూతురికి తెలియకుండానే ఆమెను కాపాడుతూ ఉంటాడు.
దాదాపు ఇదే స్టోరీ లైన్ తో బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా రానుందని టాక్ నడుస్తోంది. కాకపోతే ప్రెజెంట్ జనరేషన్ కు తగ్గట్టుగా కొన్ని చేంజెస్ చేశారట దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఈ న్యూస్ తెల్సుకున్న నందమూరి ఫ్యాన్స్ మాత్రం కాస్త కలవరపడుతున్నారు. ఈ స్టోరీ ఏదో తేడా కొడుతుంది అనీలన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.