Akhanda 2 Bookings: ‘అఖండ 2’ బుకింగ్స్ ఓపెన్.. మొదలైన బాలయ్య-బోయపాటిల తాండవం..

Akhanda 2 Bookings: ‘అఖండ 2’ బుకింగ్స్ ఓపెన్.. మొదలైన బాలయ్య-బోయపాటిల తాండవం..

ఈ వారం (2025 డిసెంబర్ 5), టాలీవుడ్‌ లో అఖండ ఘట్టం మొదలవ్వనుంది. బాలకృష్ణ-బోయపాటిల మాస్ తాండవం అఖండ 2 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'అఖండ 2' టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. ఈ క్రమంలోనే బుధవారం (డిసెంబర్ 3న) ఆంధ్రప్రదేశ్ లో అఖండ 2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నైజాంలో మాత్రం ఇవాళ సాయంత్రానికి బుకింగ్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 

డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాని సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో, ప్యాన్-ఇండియా స్థాయిలో రూపొందించారు. ఇందులో బాలకృష్ణ అఘోర, మురళీ కృష్ణ అనే రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. ట్రైలర్, గ్లింప్స్‌ను ఇప్పటికే అంచనాలను రెట్టింపు చేశాయి.. బాలకృష్ణ పవర్-ప్యాక్డ్ డైలాగ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, బోయపాటి సనాతన కాన్సెప్ట్, థమన్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి. 

అఖండ 2 ఏపీ టికెట్ రేట్స్:

సింగిల్ స్క్రీన్‌లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ధర పెంచుకునేందుకు వెసులుబాటు లభించింది. డిసెంబరు 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షోలకు కూడా అనుమతి లభించింది. ఈ ప్రీమియర్ టికెట్ ధరను ఏకంగా రూ.600 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు. రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పెంచిన ధరలు విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ నిర్ణయంతో తొలి పది రోజుల్లోనే ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.