చిరంజీవికి నాకు పోటీ ఉండాల్సిందే : బాలకృష్ణ

చిరంజీవికి నాకు పోటీ ఉండాల్సిందే : బాలకృష్ణ

హీరోయిన్ శృతిహాసన్ తన రాక్షసి అంటూ బాలకృష్ణ  కామెంట్ చేశారు. వీరసింహారెడ్డి మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆయన ఈ కామెంట్ చేశారు. ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  నయనతార ఊర్వశి అని,  శృతిహాసన్ రాక్షసి అని అన్నానని బాలయ్య అన్నారు. అయితే ఇదే విషయాన్ని శృతిహాసన్ కు చెబితే నవ్విందంటూ బాలయ్య తెలిపారు.  తనది రాక్షసగణమని, శృతి రాక్షసి కావడంతో ఇద్దరికి బాగా కలిసిందని  బాలయ్య చెప్పారు. ఇక శృతి  మంచి  నటి అని బాలయ్య కొనియాడారు.  

మరోవైపు ఏ రంగంలోనైనా పోటీ ఉండాల్సిందేనని బాలకృష్ణ అన్నారు. పోటీ ఉంటేనే  ఇండస్ట్రీ బాగుంటదని తెలిపారు. వీరసింహారెడ్డికి పోటీగా వస్తోన్న చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రానికి బాలయ్య ఆల్ ది బెస్ట్ చెప్పారు. చిరంజీవికి తనకు పోటీ ఉండాల్సిందేనని ఈ సందర్భంగా  గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన చిత్ర పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.