నటసింహం నందమూరి బాలకృష్ణ,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ. వీరి సూపర్ హిట్ కాంబోలో రాబోతున్న చిత్రం 'అఖండ 2: తాండవం' . ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. లేటెస్టుగా అభిమానుల అంచనాలను మరింత పెంచే సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జాజికాయ.. జాజికాయ ' మాస్ సాంగ్ ను చిత్ర బృందం మంగళవారం (నవంబర్ 18) అధికారికంగా విడుదల చేసింది. మాస్ ఆడియన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా.. ఈ పాట లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు చిత్ర బృందం హాజరై సందడి చేసింది.
తమన్ మ్యూజిక్.. బాలయ్య డ్యాన్స్ పవర్!
ఎస్.ఎస్. తమన్ కంపోజ్ చేసిన ఈ 'జాజికాయ' పాట, ఊపు తెప్పించే బీట్స్, అదిరిపోయే మాస్ రిథమ్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తమన్ తనదైన స్టైల్‌లో ఇచ్చిన మ్యూజిక్ బాలయ్య ఎనర్జీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యిందని అభిమానులు అంటున్నారు. విజువల్స్ పరంగా చూస్తే, ఈ పాటను ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో షూట్ చేశారు. ఆ సెట్‌లో బాలకృష్ణ తనదైన మాసివ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు. బాలయ్య స్టెప్పులు వేస్తుంటే, థియేటర్‌లో అభిమానులు విజిల్స్ వేయడం ఖాయమని స్పష్టమవుతోంది.
బాలయ్య-సంయుక్త జోడీ మెస్మరైజ్!
ఈ పాటలో బాలయ్య సరసన నటిస్తున్న సంయుక్త మీనన్ గ్లామరస్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించింది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని, డ్యాన్స్‌లో ఇరగదీశారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'హరహర మహాదేవ' పాట శివభక్తులను, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, ఈ 'జాజికాయ' పాట సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
బాలయ్య చిన్న కుమార్తె ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, బాలీవుడ్ నటి, బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'అఖండ 2: తాండవం' డిసెంబర్ 5న 2డీ , 3డీ ఫార్మాట్‌లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. బోయపాటి తన ట్రేడ్‌మార్క్ యాక్షన్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు.
