
బాలాపూర్ బాబానగర్ లోని ఒక ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ప్లాస్టిక్ కంపెనీ కావడంతో మంటలు త్వరగా వ్యాపించి.. పొగ దట్టంగా అలుముకుంది. కంపెనీ స్టాక్ ఉన్న ప్లాస్టిక్ అంతా కాలి బూడిదఅయింది. ఈ ప్రమాదంలో ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది.