మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం : రోనాల్డ్ రోస్

మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం : రోనాల్డ్ రోస్

హైదరాబాద్, వెలుగు: పోలింగ్ ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని హైదరాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్​రోస్ సూచించారు. సోమవారం బంజారాహిల్స్ కుమ్రంభీం ఆదివాసీ భవన్ లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది సమర్థంగా పనిచేయాలన్నారు.

మైక్రో అబ్జర్వర్లు ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకోవాలని చెప్పారు. పోలింగ్​ముందు రోజు ఉదయం నిర్ణీత సమయంలోగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకొని, సామాగ్రి సక్రమంగా అందిందా లేదా అన్నది పరిశీలించాలని, అనంతరం సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రతి దశలో నిర్ణయాత్మకంగా ఉంటుందని, నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ జరగాలని, పోలింగ్ రోజు ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5.30 గంటలకే మాక్ పోల్ పూర్తిచేయాలని ఆదేశించారు. పోలింగ్​వివరాల నివేదికను జనరల్ అబ్జర్వర్ కు అందించాలని సూచించారు.