బాలింతకు ఎంత కష్టమొచ్చిందో..

బాలింతకు ఎంత కష్టమొచ్చిందో..

సర్కార్ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం. ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. అధికారులు, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం నిరుపేదలకు శాపంగా మారింది. వైద్య  సేవలు సంగతి దేవుడు ఎరుగు..కనీసం మౌలిక వసతులు కల్పించడంలో కూడా విఫలమవుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురంకు చెందిన దివ్యాంగురాలైన జీ ఉపేంద్ర అనే గర్భిణీకి నొప్పులు రావడంతో ఆశావర్కర్లు డెలివరీ నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.డెలివరికి తీసుకు వచ్చే ముందు తల్లీ, బిడ్డను జాగ్రత్తగా ఉచిత వెహికిల్ లో క్షేమంగా ఇంటికి చేర్చుతామని చెప్పారు.పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉపేంద్ర ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది.నిరుపేద కుటుంబానికి చెందిన వారి వద్ద ఇంటికి వెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు.వారి విలేజ్ ఆశా కార్యకర్తలకు,102 వాహనాల డ్రైవర్లకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించలేదు.దీంతో  నిరుత్సాహంతో ఆస్పత్రి ముందు పసిబిడ్డను పట్టుకుని వీల్ చైర్ లో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేచిచూసి కన్నీరు పెట్టుకున్నారు.దీంతో మీడియా ప్రతినిధులు ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఫోన్ చేసి ఉపేంద్ర సమస్యను వివరించారు.ఆయన స్పందించి వాహనాన్ని ఏర్పాటుచేశారు.ఒకవైపు జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రభుత్వ హాస్పిటల్స్ కు ఓపీ సేవలు పెంచి,నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని చెబుతున్నా, కిందిస్థాయి సిబ్బంది మాత్రం ఆస్పత్రికి వచ్చిన పేదలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భార్యాభర్తలు వెహికిల్ కొరకు ఎదురుచూసే దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి.