
బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. సోమవారం ఇత్వార్‌పేట్‌లో దళితులు ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. గ్రామంలో 60 శాతం ఉన్న తమకు దళితబంధు ఇవ్వలేదనిమండిపడ్డారు.
నియోజకవర్గంలోనాలుగు గ్రామాలకు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా అని నిలదీశారు. అర్హులకు దళిత బంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, దళితులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. చేసేదేమీ లేక మంత్రి ప్రశాంత్‌రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.