కష్టపడితే అడగకున్నా పదవులు వస్తయ్ : బల్మూరి వెంకట్

కష్టపడితే అడగకున్నా పదవులు వస్తయ్ :  బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు :  రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన అనిల్​ కుమార్​యాదవ్​కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శుభాకాంక్షలు తెలియజేశారు. తనను రాజ్యసభకు నామినేట్​చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పాలని అసెంబ్లీకి వచ్చిన అనిల్​కు.. బల్మూరి వెంకట్ కనిపించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ..తాను చేసిన ప్రతి ఉద్యమంలోనూ ఓ సోదరుడిగా అనిల్​ అండగా ఉన్నారని చెప్పారు.

 కాంగ్రెస్​ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర కీలకమని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్​ ఇవ్వకపోయినా.. అనిల్​ కష్టాన్ని గుర్తించి పార్టీ రాజ్యసభకు నామినేట్​ చేయడం ఆనందంగా ఉందన్నారు. యావత్​ ఎన్ఎస్​యూఐ కూడా ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నదన్నారు. కష్టపడిన వాళ్లకు అడగకున్నా పదవులు వస్తాయనేందుకు ఇదే నిదర్శనమని వెంకట్​ తెలిపారు.