కబడ్డీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో బల్టీ.. తమిళ్లో సూపర్ హిట్.. తెలుగులో అక్టోబర్ 10న రిలీజ్

కబడ్డీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో బల్టీ.. తమిళ్లో సూపర్ హిట్.. తెలుగులో అక్టోబర్ 10న రిలీజ్

షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్‌‌‌‌తో పాటు ‘ప్రేమమ్’ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ముఖ్య పాత్రల్లో  ఉన్ని శివలింగం తెరకెక్కించిన చిత్రం ‘బల్టీ’. తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఎల్మా పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  ఎన్. ఎథిల్ రాజ్  ఈనెల 10న తెలుగులో  రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. కబడ్డీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్‌‌‌‌స్టర్ డ్రామా కూడా ఉండటంతో తెలుగులోనూ ఈ చిత్రం సక్సెస్ సాధిస్తుందని నిర్మాత ఎథిల్ రాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జ‌‌‌‌రిగే అవుట్‌‌‌‌ అండ్ అవుట్ రా అండ్  ర‌‌‌‌స్టిక్ విలేజ్ డ్రామాగా ఈ సినిమా  ఉంటుందని ఆయన తెలియజేశారు.