మిస్టరీ స్పిన్నర్లా.. తొక్కా..!: ఆఫ్ఘన్ బౌలర్లను చితక్కొట్టిన బంగ్లాదేశ్ బ్యాటర్లు

మిస్టరీ స్పిన్నర్లా.. తొక్కా..!: ఆఫ్ఘన్ బౌలర్లను చితక్కొట్టిన బంగ్లాదేశ్ బ్యాటర్లు

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ప్రత్యర్థి జట్టులో మిస్టరీ స్పిన్నర్లు ఉన్నా.. వారిని ఏమాత్రం లెక్కచేయలేదు. బౌలింగ్ వేయడానికే వెనకడుగు వేసేలా చితక్కొట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతోన్న చావో రేవో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవరర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. మెహిదీ హసన్ మిరాజ్(112 రిటైర్డ్ హర్ట్), నజ్ముల్ హుస్సేన్ శాంటో(104)లు ఇద్దరూ సెంచరీలు చేశారు.

మిస్టరీ స్పినరర్లా.. తొక్కా..!

ఆఫ్ఘన్ జట్టులో రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీ రూపంలో ముగ్గరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నా.. బంగ్లా బ్యాటర్లు వారిని ఏమాత్రం లెక్కచేయలేదు. బ్యాటింగ్ ఎంచుకుందే మొదలు ధనాధన్ బ్యాటింగ్‌తో హోరెత్తించారు. మెహిదీ హసన్ (112 రిటైర్డ్ హర్ట్; 119 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు), లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(104; 105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీలు చేశారు.

మెహిదీ హసన్- శాంటో జోడిమూడో వికెట్ కు ఏకంగా 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే చివరలో వరుస వికెట్లు కోల్పోవడంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్, గుల్బాదిన్ నాయబ్ చెరో వికెట్ తీసుకున్నారు.