BAN vs NED: 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లా.. విజయం దిశగా నెదర్లాండ్స్

BAN vs NED:  70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లా.. విజయం దిశగా నెదర్లాండ్స్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లా బ్యాటర్లు తడబడుతున్నారు. డచ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. 

230 పరుగుల లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు లిట్టన్ దాస్‌ (3), తాంజిద్‌ హసన్‌ (15) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌  చేరగా.. వన్‌ డౌన్‌లో వచ్చిన మెహిది హసన్‌ మిరాజ్‌ (40 బంతుల్లో 35, 5 ఫోర్లు, 1 సిక్సర్‌) కాస్త ఫర్వాలేదనిపించాడు. నజ్ముల్‌ హోసేన్‌ శాంతో (9), షకిబ్‌ అల్  హసన్‌ (5), ముష్ఫీకర్‌ రహీమ్‌ (1)  కూడా వెంటవెంటనే ఔట్ అవ్వడంతో కష్టాల్లో పడింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగుల వద్ద ఆలౌట్‌ అయ్యింది. డచ్ కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (68; 89 బంతుల్లో 6 ఫోర్లు), సిబ్రండ్‌ సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ ( 35; 61 బంతుల్లో 3 ఫోర్లు) పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో  టస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, షోరిఫుల్‌ ఇస్లాంలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.