భూ నిర్వాసితులపై దాడి.. హుస్నాబాద్లో బంద్..

భూ నిర్వాసితులపై దాడి.. హుస్నాబాద్లో బంద్..

సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులపై నిన్న పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి నిరసనగా హుస్నాబాద్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ లో భూ నిర్వాసిత గ్రామాల రైతులు,కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, నిన్న అర్ధరాత్రి హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూనిర్వాసిత గ్రామాన్ని ఖాళీ చేయించడానికి పోలీసులు ప్రయత్నించగా అందుకు గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో గ్రామస్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి చివరికి పరిస్థితి అదుపుతప్పడంతో లాఠీ చార్జ్ జరిగింది.