
ఉప్పల్, వెలుగు: తనను గెలిపిస్తే ఉప్పల్ సెగ్మెంట్‌కు జూనియర్ , డిగ్రీ కాలేజీ తీసుకొస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం నాచారంలో నిర్వహించిన ఫుడ్ ఫీస్ట్ ప్రోగ్రామ్‌కు ఆయన హాజరై మాట్లాడారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని.. సెగ్మెంట్ వాసులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం రామంతాపూర్‌లో బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ ఉప్పల్ సెగ్మెంట్ ఇన్ చార్జి రావుల శ్రీధర్, సీనియర్ నేత రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రావుల శ్రీధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గంధం నగేశ్, డివిజన్ అధ్యక్షుడు ముస్తాక్, బాబు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.