ఫోరెన్సిక్ ల్యాబ్‌కు బండి భగీరథ్ ఐఫోన్..సీక్రెట్స్ బయటపడతాయా?

ఫోరెన్సిక్ ల్యాబ్‌కు బండి భగీరథ్ ఐఫోన్..సీక్రెట్స్ బయటపడతాయా?

బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల ముందు సరెండర్ అయిన బండి భగీరథ్.. తన మొబైల్ ఫోన్‌ను పోలీసులకు హ్యాండోవర్ చేశాడు. తాను వాడుతున్నఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) మొబైల్‌ను పోలీసులకు అప్పగించాడు. దీంతో పేట్ బషీరాబాద్ పోలీసులు ఆ ఐఫోన్‌ను సీజ్ చేసి, తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మొబైల్ ఫోన్ ద్వారా కేసులో కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలైన మైనర్ అమ్మాయితో బండి భగీరథ్ జరిపిన చాటింగ్స్, మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలతో పాటు సీసీటీవీ ఫుటేజ్లు ఏమైనా ఉన్నాయా? లేదా వాటిని డిలీట్ చేశారా? అనే కోణంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకోనున్నారు.

గత  ఏడాది కాలంగా ఆ మైనర్ అమ్మాయితో భగీరథ్ ఎలా వ్యవహరించేవాడు? ఎలాంటి సందేశాలు పంపించేవాడు? అనే పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. అంతేకాదు.. కేవలం ఆ మైనర్ అమ్మాయితోనే కాకుండా, ఇంకా ఇంకెంతమంది అమ్మాయిలతో బండి భగీరథ్ కాంటాక్ట్‌లో ఉన్నాడు? వారికి ఎలాంటి సందేశాలు పంపాడు? ఇంకెవరినైనా ఈ రకంగా లోబరుచుకున్నాడా? అనే సంచలన డేటాను కూడా పోలీసులు వెలికితీయబోతున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడే అవకాశం ఉంది.