పెగ్గేస్తేనే కేసీఆర్ కు హామీలు గుర్తొస్తాయి: బండి సంజయ్

పెగ్గేస్తేనే కేసీఆర్ కు హామీలు గుర్తొస్తాయి: బండి సంజయ్

ఖమ్మంలో కమలం వికసిస్తుందని  బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి  బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీకి అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారన్నారని బండి సంజయ్ ఖమ్మం సభలో అన్నారు.  ఖమ్మానికి ప్రత్యేక చరిత్ర ఉందంటూ.. ఉద్యమాల గడ్డ, పౌరుషాల గడ్డని అన్నారు బండి సంజయ్.  కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన ఘనత ఖమ్మం జిల్లాకే దక్కిందన్నారు. 

కేసీఆర్ అసలు పేరు దుబాయ్ శేఖర్ అంటూ మోసాలు చేయడంలో ఆయన పీహెచ్ డీ చేశారని బీజేపీ నేత బండి సంజయ్ విమర్శించారు.  తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ ను కేసీఆర్ అవమాన పరిచారన్నారు. పెగ్గేస్తేనే ఇచ్చిన కేసీఆర్ కు హామీలు గుర్తొస్తాయన్న బండి సంజయ్  తెలంగాణ అభివృద్ది చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు.  కాంగ్రెస్ నేతలు మోసం చేయడానికి వస్తున్నారని.. వారి మాటలు విని మోస పోవవద్దని ఖమ్మం సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.