
అల్వాల్ వెలుగు: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబ సభ్యులను కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఆదివారం అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి సూసైడ్ చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.