- కేంద్రం లేఖ రాసినా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ డీపీఆర్ ఎందుకియ్యలే?
- తప్పులు కేసీఆర్ చేసి మోడీని, కేంద్రాన్ని తిడుతున్నడు
- అబద్ధాలతో మోసం చేస్తున్నడు
- సర్పంచులతోపాటు అన్ని వర్గాలను గోసపెడ్తున్నడు
- ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లోని మరో 20 తప్పు ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: గవర్నర్‌ను బద్నాం చేసేందుకు హైకోర్టుకు వెళ్లి కేసీఆర్ సర్కార్ భంగపడిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ‘‘అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ను పిలిస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? బడ్జెట్ అనుమతి కోసం ఇంకా టైం ఉంది కదా..! అలాంటిది కోర్టుకు వెళ్లడం గవర్నర్ ను బద్నాం చేసే ప్రయత్నం కాక మరేంది? ఈ విషయంలో కేసీఆర్ సర్కారుకు హైకోర్టు చెంప చెల్లుమనిపించినా ఆయనకు సిగ్గు రాలేదు” అని మండిపడ్డారు. కేసీఆర్ కు కోర్టులంటే లెక్కలేదని, రాజ్యాంగాన్ని పట్టించుకోరని అన్నారు. ప్రజలు కూడా కేసీఆర్‌ను పట్టించుకోవడం మానేశారని తెలిపారు. పోలీసుల దాడిలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ ను సోమవారం బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బడ్జెట్ ఫైలు ఆమోదం కోసం మూడు రోజుల కిందటే గవర్నర్ కు పంపితే ఆమోదం తెలపడం లేదని, ఇబ్బంది పెడ్తున్నారని కోర్టుకెక్కిన కేసీఆర్...మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని ఫిర్యాదు చేస్తే...స్పీకర్ ఏండ్ల తరబడి ఆ ఫైల్‌ను పెండింగ్ లో పెడితే ఎందుకు మాట్లాడటం లేదు. దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెప్తడు?” అని ప్రశ్నించారు.
కేసీఆర్‌వి చిల్లర రాజకీయాలు
సీఎం కేసీఆర్ చిల్లరరాజకీయాలు చేస్తున్నారని, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడం లేదంటూ ప్రధానిని, కేంద్రాన్ని తిట్టడమే కేసీఆర్, బీఆర్ఎస్ లీడర్లు పనిగా పెట్టుకున్నరు. ఇంతవరకూ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్ర సర్కారే ఇవ్వలేదని కేంద్రం తేల్చింది. మూడున్నరేండ్లుగా 8 సార్లు లేఖలు రాసినా రాష్ట్ర సర్కార్ నుంచి స్పందనేలేదని చెప్పింది. మరి కేసీఆర్.. ఇప్పుడు నీ ముఖం ఏడ పెట్టుకుంటవ్?” అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి ఇంతకాలం ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. అభివృద్ధిపై చర్చకు రాకుండా అబద్ధాలతో చర్చను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఎస్ఐ అభ్యర్థులకు న్యాయం చేయాలి
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మరో 20 ప్రశ్నలు, జవాబులు తప్పుల తడకగా మారాయని, వెంటనే సరిచేయడంతోపాటు ఈ పరీక్షలకు పెట్టిన నిబంధనలను సడలించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘కేసీఆర్ చిల్లర బుద్ధులతో చిల్లర పనులు చేస్తున్నడు. నష్టపోయిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరడం తప్పా? దేశంలో ఎక్కడాలేని విధంగా నిబంధనలు పెడ్తున్నరు. ప్రశ్నాపత్రాలు తప్పుల తడకగా ఉంటున్నయ్. 20 ప్రశ్నలకు జవాబులు తప్పు. వాటికి మార్కులివ్వాలనే సోయి ఈ సర్కార్‌కు లేదు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నరు. అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్నరు. వెంటనే ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి” అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

అన్ని వర్గాలను ఇబ్బంది పెడ్తున్నడు
కేసీఆర్ పాలనలో సర్పంచులతోపాటు అన్ని వర్గాలవాళ్లు గోసపడుతున్నారని బండి సంజయ్ అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘‘సర్పంచులను కేసీఆర్ తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారడానికి నిజామాబాద్ ఘటనే నిదర్శనం. చేసిన పనులకు బిల్లులివ్వరు. కేంద్రం ఇచ్చిన నిధులను సర్పంచులకు తెలియకుండా దొంగలిస్తరు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నరు. ప్రశ్నించిన ఎంపీ అర్వింద్‌ను దూషిస్తున్నరు. కేసీఆర్ దృష్టిలో నోరు మూసుకుని కూర్చునే వాళ్లు మంచోళ్లు...ప్రశ్నించే వాళ్లు దుష్టులు” అని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ ప్రాంతానికి పోయినా నిజాం రాజుల్లా ఫీలవుతున్నారని విమర్శించారు. ‘‘మంత్రి కేటీఆర్ మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ వెళ్లాల్సి ఉండగా.. సోమవారం నుంచే హన్మకొండ, హుజూరాబాద్ ప్రాంత బీజేపీ నాయకులు, కార్యకర్తలందరినీ పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ లో పెడుతున్నరు. కేసీఆర్ మెప్పు కోసం బీజేపీ కార్యకర్తలను హింసిస్తరా..? ఇదేం పద్ధతి? ” అని డిమాండ్ చేశారు. సంజయ్ వెంట మాజీ ఎంపీ చాడా సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కోశాధికారి భండారి శాంతికుమార్ తదితరులు ఉన్నారు.