పాదయాత్రతో టీఆర్ఎస్కు భయం పుట్టుకుంది

పాదయాత్రతో టీఆర్ఎస్కు భయం పుట్టుకుంది

సీఎం కేసీఆర్కు మందు మీద ఉన్న ప్రేమ..మంది మీద లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రైతులు, యువకులు, ఉద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.  అంగట్లో సరుకుల్లాగా.. -స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. విస్నూర్ రామచంద్రారెడ్డికి  కేసీఆర్కు ఏమీ తేడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా ధర్మారంలో బండి సంజయ్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 

పాదయాత్రతో టీఆర్ఎస్కు భయం పుట్టింది..
రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను కేంద్రమే కొనుగోలు చేస్తుందని బండి సంజయ్ అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతీ పైసా కేంద్రమే ఇస్తుందని చెప్పారు. గ్రామాలకు కేసీఆర్ ఏమీచ్చారని ప్రశ్నించారు. పేదల ఓట్లను డబ్బులతో కొనడమే కేసీఆర్ పని అని ఆరోపించారు. -ప్రధాన్ ఆవాస్ యోజన కింద కేంద్రం రెండు లక్షల ఇండ్లు ఇస్తే కేసీఆర్ ఎందుకు ఇవ్వాట్లేదని నిలదీశారు. పాతభస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా పాదయాత్ర ప్రారంభిస్తే టిఆర్ఎస్ కు భయం పుట్టిందని ఎద్దేవా చేశారు. ఎన్ని డబ్బులు పంచానని..ప్రజలు హుజురాబాద్, దుబ్బాకలో గెలిపించారని ప్రశ్నించారు. మోడీ పాలన చూసి జనం బీజేపీని గెలిపించారని చెప్పారు.