పేపర్ లీక్కు వ్యతిరేకంగా..  గన్పార్క్ వద్ద బండి సంజయ్ దీక్ష

పేపర్ లీక్కు వ్యతిరేకంగా..  గన్పార్క్ వద్ద బండి సంజయ్ దీక్ష

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద దీక్ష మొదలుపెట్టారు. బీజేపీ ఆఫీసు నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయలు దేరిన బండి.. గన్ పార్క్ వద్ద అమరులకు నివాలులు అర్పించి దీక్ష ప్రారంభించారు. దీంతో గన్ పార్క్ వద్ద తీవ్ర ఉధృతి నెలకొంది. పోలీసులు బారీగా బలగాలను మోహరించి బీజేపీ కార్యకర్తలను అదుపుచేస్తున్నారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి పేర్కొన్నారు.  

గ్రూప్ 1 ప్రశ్నా పత్రం లీక్ చేసి లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకున్నాడని కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు. పేపర్ లీక్ పై ఇంత జరుగుతున్నా నోరు మెదపని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అని ప్రశ్నించారు. సీఎం.. పేపర్ లీక్ పై తక్షణమే స్పందించి సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డికి బీజేపీ కార్యకర్తలంతా ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎలక్షన్ లో గెలిచేది బీజేపీ ప్రభుత్వమే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అందుకు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచిన ఏవీఎన్ రెడ్డి బీజేపీకీ స్పూర్తి, ఆదర్శం అని బండి అన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని బండి విమర్శించారు. ఈ ప్రభుత్వానికి టీచర్లే గుణపాఠం చెప్తారని బండి వెల్లడించారు.