బాలెంల గ్రామాన్ని మోడ్రన్ పంచాయతీగా మారుస్తాం : పటేల్ రమేశ్ రెడ్డి

బాలెంల గ్రామాన్ని మోడ్రన్ పంచాయతీగా మారుస్తాం : పటేల్ రమేశ్ రెడ్డి
  • తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు: బాలెంల గ్రామాన్ని మోడ్రన్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా నని తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బాలెంల గ్రామంలో స్వచ్ఛభారత్ కా ర్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామంలో సర్పంచ్ గాలి మమత నగేష్ ఆధ్వర్యం లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 

సర్పంచ్ గా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే గాలి మమత నగేష్ పారిశుధ్యం, స్వచ్ఛత, వీధిలైట్ల ఏర్పాటులపైనే చర్యలు తీసుకున్నారన్నారు. దీనిలో భాగంగానే దాతల సహకారంతో బాలెంల స్టేజ్ నుంచి ప్రైమరీ స్కూల్ వరకు వీధిలైట్స్ ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం సందర్భం గా గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిం చారు. పటేల్ శ్రీధర్ రెడ్డి, బాలెంల గ్రామ కార్యదర్శి రాజు, డా. రామ్మూర్తి యాదవ్, గట్టు శ్రీనివాస్, షఫీ అలీ. గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.