ట్రాన్స్ జెండర్ కావేరి ప్రమాణ స్వీకారం

ట్రాన్స్ జెండర్ కావేరి ప్రమాణ స్వీకారం

చిట్యాల, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన ట్రాన్స్ జెండర్  సుధాకర్ అలియాస్ కావేరి సోమవారం మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కావేరి మాట్లాడుతూ..  తన విజయం వ్యక్తిగత విజయమే కాదు, ట్రాన్స్ జెండర్ సమాజం సాధించిన గౌరవమన్నారు.

వార్డు అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం తన తొలి లక్ష్యం అని తెలిపారు. ప్రజలు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.