విధేయులకే చైర్‌‌పర్సన్‌ పీఠం

విధేయులకే చైర్‌‌పర్సన్‌ పీఠం

యాదాద్రి, వెలుగు:  మున్సిపాలిటీల కొత్త పాలకవర్గాలు కొలువుతీరాయి. చైర్‌‌పర్సన్​, వైస్​ చైర్​ పర్సన్​ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. భువనగిరి, చౌటుప్పల్​లో చైర్​పర్సన్​ఎంపికపై ఇద్దరు మహిళా కౌన్సిలర్లు బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్​, పోచంపల్లి, మోత్కూరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో ఫలితాలు వెలువడక ముందే కాంగ్రెస్​ కౌన్సిలర్లు క్యాంపులకు వెళ్లిపోయారు. క్యాంపుల్లోనే కాంగ్రెస్​కు విధేయులుగా ఉన్న వారినే చైర్​ పర్సన్​, వైస్​ చైర్​పర్సన్​లుగా ఎంపిక చేసి బీ ఫారాలు అందించారు. ప్రమాణ స్వీకారాలతో పాటు చైర్​ పర్సన్​, వైస్​ చైర్​ పర్సన్​ ఎన్నిక ఉండడంతో క్యాంపు నుంచే డైరెక్ట్​గా ప్రత్యేక బస్సుల్లో ర్యాలీగా వచ్చారు. 

చైర్‌‌పర్సన్​, వైస్​చైర్​పర్సన్​ల ఎన్నిక

మున్పిపాలిటీలకు కౌన్సిలర్లు చేరుకోగానే ఎన్నికల ఆథరైజ్డ్​ఆఫీసర్లుగా వ్యవహరించిన అడిషనల్​ కలెక్టర్​ఏ. భాస్కరరావు, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్​రెడ్డి, డీపీవో విష్ణువర్దన్​ రెడ్డి, తడీఆర్​డీవో నాగిరెడ్డి, అడిషనల్​ డీఆర్​డీవో సురేశ్​ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం జరిపించారు. కౌన్సిల్​కు హాజరైనట్టుగా వారితో మినిట్స్​లో సంతకాలు తీసుకున్నారు. బీ ఫారాల్లో పేర్కొన్న చైర్​ పర్సన్​ల పేర్లు ప్రకటించి, ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత వైస్​ చైర్​ పర్సన్​ల ఎన్నికలు నిర్వహించారు. 

గుట్టలో కాంగ్రెస్‌కు  బీఆర్‌‌ఎస్ ఓటు

యాదగిరిగుట్ట 8వ వార్డులో గెలిచిన బీఆర్​ఎస్​ ఏకైక కౌన్సిలర్​ పేరబోయిన సత్యనారాయణ కాంగ్రెస్​కు మద్దతు ప్రకటించారు. చైర్​ పర్సన్​, వైస్​ చైర్​ పర్సన్లకు అనుకూలంగా ఓటు వేశారు.  మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియలో ఎక్స్ అఫిషియోలుగా నమోదు చేయించుకున్న ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య, మునుగోడు, భువనగిరి, తుంగతుర్తి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, మందుల సామెల్​ పాల్గొన్నారు. ఎన్నికలను బీజేపీ, బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు బహిష్కరించారు. ఆలేరు, చౌటుప్పల్​ల్లో ఆయా పార్టీల కౌన్సిలర్లు మున్సిపాలిటీల వైపునకు కూడా రాలేదు. యాదగిరిగుట్టలో మాత్రం బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన​ అనంతరం చైర్​ పర్సన్​, ఎన్నికను బహిష్కరించారు.

మహిళా కౌన్సిలర్ల అసంతృప్తి ఎమ్మెల్యే కారు నుంచి వెళ్లిపోయిన కౌన్సిలర్​

చౌటుప్పల్, యాదగిరిగుట్ట, వెలుగు:  భువనగిరి మున్సిపల్​ కౌన్సిల్​ సమావేశంలో కాంగ్రెస్​ కౌన్సిలర్​ శ్రీవాణి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు హామీ ఇచ్చి ఉల్లంఘించారని ఆరోపించారు. పైగా నాన్​ లోకల్​ అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. 11వ వార్డు నాన్​లోకల్​ అయితే.. మున్సిపాలిటీలో ఎందుకు కలిపారని ప్రశ్నించారు. చౌటుప్పల్​ చైర్​ పర్సన్​గా ప్రచారంలో ఉన్న బత్తుల వాణికి కాకుండా మొదదాల పావనిని ఎంపిక చేశారు. దీంతో నిరాశలో ఉన్న వాణిని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన కారులోనే మున్సిపాలిటీకి తీసుకెళ్తూ సర్దిచెప్పే  ప్రయత్నం చేస్తున్నారు. ఇదే  సమయంలో వాణికి సంబంధించిన అనుచరులు నిరసన ప్రదర్శనగా వస్తూ కారుకు అడ్డంగా నిలబడ్డారు. దీంతో ఆమె కారు నుంచి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది.  

ఎన్నికలకు ముందే యాదగిరిగుట్ట మున్సిపల్ వైస్ చైర్​ చైర్మన్ గా ముక్కెర్ల మల్లేష్ యాదవ్ పేరును ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అధికారికంగా ప్రకటించారు. చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి, వైస్ చైర్​ పర్సన్​గా ప్రచారంలో ఉన్న ముక్కెర్ల మల్లేష్ యాదవ్ గుండ్లపల్లి ఏరియాకు చెందిన వారే. దీంతో ఒకే ఏరియాకు చైర్​ పర్సన్​, వైస్​ చైర్​పర్సన్​ పదవులు ఇవ్వడం సరికాదన్న ఉద్దేశంతో చివరి నిమిషంలో బరిగె రమ్యకు వైస్​ చైర్​ పర్సన్​గా అవకాశం ఇచ్చారు.