
హైదరాబాద్: బీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీసీలంటే కాంగ్రెస్ కు అంతా చులకనా? అని మండిపడ్డారు. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఓబీసీని ఎందుకు ప్రధానిని చేయలేదని ప్రశ్నించారు. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందన్న సంజయ్ బీసీని బీజేపీ సీఎం చేస్తామనగానే కుల గణన గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు.
డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ కు కుల గణన ఎలా సాధ్యమవుతుందన్నారు. దేశంలో ప్రతిపక్ష స్థానం కోల్పోయిన పార్టీ చెబితే నమ్మేదేలా? అని ప్రశ్నించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పిన తరువాతే ఓట్లు అడగాలని బండి సంజయ్ అన్నారు.
ALSO READ : కేసీఆర్ ఫాం హౌజ్ లో రెండో రోజూ యాగం