కేసీఆర్ నీ కొడుకు వీపంతా పగలగొడితే ఆ బాధ తెలుస్తది

కేసీఆర్ నీ కొడుకు వీపంతా పగలగొడితే   ఆ బాధ తెలుస్తది
  • మహనీయుల జయంతి ఉత్సవాలను కేసీఆర్ మరిచిపోయారు
  • వివేకానంద ఫ్లెక్సీలు కట్టిన బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం అమానుషం

మహనీయుల జయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజ్యాంగ నిర్మాత.. మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, యువతకు మార్గదర్శకంగా నిలిచే మహనీయుడు స్వామి వివేకానందలను కేసీఆర్ విస్మరించారన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఫ్లెక్సీలు కట్టిన బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం అమానుషమన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని..కొంతమంది పోలీస్ అధికారులు బీజేపీ కార్యకర్తల రక్తం కళ్ల చూస్తున్నారన్నారు. వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న బండి సంజయ్..సీఎస్, డీజీపీలకే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదన్నారు.

మంత్రులు దద్దమ్మలుగా మారారని.. వారికి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని.. జనగామలో బీజేపీ కార్యకర్తల పై జరిగిన లాఠీచార్జి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలన్నారు. స్వామి వివేకానంద జయంతి రోజు కూడా బయటకు రాకపోవడం ముఖ్యమంత్రి దిగజారుడు తనమని.. ముఖ్య మంత్రికి సిగ్గుండాలన్నారు. స్వామి వివేకానంద ఫ్లెక్సీలు పెట్టిన బీజేపీ నాయకులపై దాడి చేయడం అమానుషమని..24 గంటల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోకుంటే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.  బుధవారం ఉదయం జనగాం వెళ్తున్నామని..లాఠీ ఛార్జ్ తో దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫామ్ హాజ్ లో పండుకునేందుకు నీకు అధికారం ఇవ్వలేదని..నీ కొడుకును కొడితే ఊరుకుంటావా అని సీఎం కేసీఅర్ ను ప్రశ్నించారు బండి సంజయ్.

నీ కొడుకు వీపు చితపండు చేస్తే.. దెబ్బలు పడ్డ కొడుకుల బాధ నీకు తెలుస్తుందన్నారు. ఇలాంటి సంఘటనలతో ముఖ్యమంత్రి కీసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. ఖబర్దార్ ముఖ్యమంత్రి .. తీరు మార్చుకోకుంటే ఆందోళన చేస్తూ ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు. కేసీఆర్ కు భాషతోపాటు దెబ్బలు కూడ అప్పగిస్తామని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.