రాజస్థాన్‎లో వింత ఘటన: మోడీ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకుని చోరీకి యత్నం

రాజస్థాన్‎లో వింత ఘటన: మోడీ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకుని చోరీకి యత్నం

జైపూర్: రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని భిల్వారా జిల్లా కరేడా పరిధిలో ఓ వింత ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి ప్రధాని మోదీ ముఖం ఉన్న మాస్క్ ధరించి, ఇనుప రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఓ మొబైల్ షాప్ తాళం పగలగొట్టడానికి ట్రై చేశాడు. ఎంత ప్రయత్నించినా తాళం రాకపోవడంతో వెనుతిరిగాడు. ఈ దృశ్యాలన్నీ షాప్ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. 

పగటిపూట అదే వ్యక్తి మాస్క్ లేకుండా, అదే డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆ ఏరియాలో తిరిగినట్లు ఇతర సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించామని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ పూరన్ మాల్ మీనా తెలిపారు. కాగా, అదే రాత్రి అక్కడికి 800 మీటర్ల దూరంలో ఉన్న మరో మొబైల్ షాపులో చోరీ జరిగిందని ఎస్​హెచ్​వో వెల్లడించారు. అయితే అక్కడ సీసీటీవీ ఫుటేజీ లేకపోవడంతో, ఆ చోరీకి పాల్పడింది కూడా ఇతనేనా కాదా అనేది పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.